పార్లమెంట్ నిరవధిక వాయిదా

పార్లమెంట్ నిరవధిక వాయిదా

  న్యూఢిల్లీ: లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. దీంతో రెండో దఫా బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఇవాళ లోక్‌సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఆమె సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభ కూడా నిరవధిక వాయిదా పడింది. చైర్మన్ వెంకయ్యనాయుడు సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ ప్రజలను కలుపుతోందని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను విభజిస్తోందని కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన, నెగటివ్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఉభయ సభలు సజావుగా సాగనివ్వకుండా ఆ పార్టీ అడ్డుకున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా బీజేపీ ఎంపీలు పార్ల‌మెంట్‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. కాంగ్రెస్ వ‌ల్లే స‌భ మొత్తం వృధాగా వెళ్లింద‌ని మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. కొంద‌రి వ‌ల్ల త‌మ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా రాణించ‌లేక‌పోయామ‌ని ఆయ‌న అన్నారు.