ప్లాస్టిక్, కాగితం జెండాలను వాడొద్దు..

ప్లాస్టిక్, కాగితం జెండాలను వాడొద్దు..

 హైదరాబాద్: జాతీయ జెండా గౌరవంపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్, కాగితం తయారీ సహా చిన్న పరిమాణంలో ఉన్న జెండాలు వాడొద్దని స్పష్టీకరించింది. జిల్లా న్యాయమూర్తులు, కలెక్టర్లు, ఎస్పీలు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేసింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. జెండా నిబంధనావళి - 2002, జాతీయ పతాక గౌరవ చట్టం 1971 అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి. జెండా ఆవిష్కరణలో నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.