రాహుల్‌ ర్యాలీపై ఆంక్షలు

రాహుల్‌ ర్యాలీపై ఆంక్షలు

  భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జూన్‌ 6న నిర్వహించనున్న ర్యాలీకి బిజెపి సర్కార్‌ ఆంక్షలు విధిచింది. ఈ ర్యాలీని అనుమతించేందుకు తొలుత 19 షరతులు విధించిన అధికారులు, దీనిపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో వాటిని ఐదుకు కుదించారు. సాంకేతిక తప్పిదం కారణంగానే తొలుత అన్ని షరతులు విధించామని కలెక్టర్‌ సర్ధిచెప్పడానికి యత్నించారు. ఇక్కడ పోలీసు కాల్పుల్లో రైతులు మరణించి ఏడాది అవుతున్న నేపథ్యంలో మృతులకు నివాళులు అర్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి అధికారులు విధించిన 5 ఆంక్షలు ఈ విధంగా ఉన్నాయి. 

ర్యాలీలో ఎలాంటి మరణాయుధాలను ధరించకూడదు. మతపరమైన భావాలు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేయకూడదు. శాంతిభద్రతలకు భంగం కలిగేవిధంగా ఎలాంటి సంఘటన జరగకూడదు. సుప్రీంకోర్టు సూచనలు ప్రకారమే లౌడ్‌ స్పీకర్లు ఉపయోగించాలి. సభా వేదిక కొరకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనే షరతులు విధించారు. ముందుగా మల్‌హర్‌ఘర్‌ సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ 19 షరతులు విధించారు. పేర్కొన్నారు. పిప్లియా మండి వద్ద కాంగ్రెస్‌ ర్యాలీకి కొత్త నిబంధనలు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ మైదానాన్ని ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ వద్ద నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపారు.