రైలు ప్రయాణీకులకు తీపికబురు

రైలు ప్రయాణీకులకు తీపికబురు

  కోల్‌కతా : రైలు ప్రయాణీకులకు భారతీయ రైల్వేలు ఊరట కల్పించాయి. 2022 నాటికి దూర ప్రాంత రైళ్ల వేగాన్ని గంటకు 25 కిమీలకు పెంచాలని రైల్వేలు నిర్ణయించాయి. సరుకు రవాణా రైళ్ల వేగాన్ని రెట్టింపు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖను కోరామని రైల్వే శాఖ సహాయమంత్రి రాజన్‌ గొహెయిన్‌ సోమవారం వెల్లడించారు.

దూరప్రాంత రైళ్ల వేగాన్ని ఏటా గంటకు 5 కిమీ మేర వేగం పెంచాలని తాము అన్ని జోనల్‌ రైల్వే జీఎంలను కోరామని, 2022 నాటికి గంటకు 25 కిమీ వేగం లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ధేశించామని చెప్పారు. ప్రయాణీకుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించాలని రైల్వే మంత్రిత్వ శాఖ బావిస్తోందని, తక్కువ సమయంలో ప్రయాణీకులను వారి గమ్యస్ధానాలకు చేరవేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఓవర్‌నైట్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.