రాజస్తాన్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న రాహుల్‌

రాజస్తాన్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న రాహుల్‌

  జైపూర్‌ : బిజెపి కోటగా భావిస్తున్న రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం మద్యాహ్నాం 1.30 గంటలకు జైపూర్‌ చేరుకున్న అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన బస్సులో ఆయన పార్టీ ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ అధ్యక్షుడు సచిన్‌పైలెట్‌ తెలిపారు. అనంతరం రామ్‌లీలామైదానంలోని బహిరంగ సభలో పాల్గంటారు. రానున్న ఎన్నికలలో విజయం కోసం ఆయన పార్టీని సన్నద్ధం చేస్తారని, కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలతో, ప్రజలతో ప్రజాభిప్రాయ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సచిన్‌ పేర్కొన్నారు. రానున్న మూడునెలల్లో పార్టీ ప్రచార ప్రణాళికను కార్యకర్తలకు వివరిస్తారని సచిన్‌ పైలెట్‌ తెలిపారు. కాగా, రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మొదటిసారిగా రాజస్తాన్‌ చేరుకుంటున్నారని, ఆయనకు ఘనస్వాగతం ఇవ్వనున్నట్లు వివరించారు.