ర‌క్ష‌ణ మంత్రి అస‌త్యాలు చెబుతున్నారు....

ర‌క్ష‌ణ మంత్రి అస‌త్యాలు చెబుతున్నారు....

 న్యూఢిల్లీ: ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ పార్ల‌మెంట్‌లో అస‌త్యాలు చెప్పార‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ‌కు ల‌క్ష కోట్లు ఇచిన‌ట్లు ర‌క్ష‌ణ మంత్రి చెప్పారు. దాన్ని మేం స‌వాల్ చేశాం, అయితే ఆ అంశాన్ని ఇవాళ ఆమె మ‌రోలా చెప్పార‌న్నారు. హెచ్ఏఎల్‌కు కేవ‌లం 26 వేల కోట్లు ఇచ్చిన‌ట్లు సీతారామ‌న్ ఇవాళ పార్ల‌మెంట్‌లో మ‌ళ్లీ తెలిపారు. దీన్ని లేవ‌నెత్తుతూ రాహుల్‌.. ర‌క్ష‌ణ మంత్రిపై ఫైర్ అయ్యారు. రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు స‌మ‌యంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ఎయిర్‌ఫోర్స్‌, ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ సీనియ‌ర్ అధికారులు అడ్డుకున్నారా లేదా అన్న విష‌యాన్ని కూడా చెప్పాల‌ని రాహుల్ డిమాండ్ చేశారు.