రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు: జైట్లీ

రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు: జైట్లీ

 ఢిల్లీ : అగ్ర వర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల బిల్లుపై లోక్‌సభలో వాడీ వేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ బిల్లు ద్వారా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పైకి తీసుకురావాలన్నదే ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లుకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ అన్న అంశాన్ని 15వ అధికరణ క్లాజ్‌(5) సవరణ సమయంలోనే చేర్చారు. అదే ప్రకారం ఇప్పుడు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లను కల్పించాలని ప్రయత్నిస్తున్నాం. పీవీ హయాంలో ప్రత్యేక చట్టం ఏమీ చేయలేదు.. అందుకే కోర్టు కొట్టివేసింది. చాలా మంది రిజర్వేషన్లు 50శాతం దాటితే కోర్టు కొట్టివేస్తుందని అంటున్నారు. ఆ ఆందోళన నిజమే అయితే ఇప్పటివరకు రిజర్వేషన్లకు ఆర్టికల్‌ 15, 16 కల్పించిన వెసులుబాటులే మూలం. ఆర్టికల్‌ 16(4)లో కులాల ఆధారంగా రిజర్వేషన్ల ప్రస్తావన ఉంది’’ అని జైట్లీ వెల్లడించారు.