రెండు గ్యాస్ ట్యాంకర్లు ఢీ

రెండు గ్యాస్ ట్యాంకర్లు ఢీ

  లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మథుర ప్రాంతం సురిర్ వద్ద యుమునా ఎక్స్ ప్రెస్ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు గ్యాస్ ట్యాంకర్ వాహనాలు ఢీకొని భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు చెలరేగడంతో రోడ్డుపై ఉన్న మరో ఐదు వాహనాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు ఫైర్ అధికారులు వెల్లడించారు.