రేపు ప్రారంభంకానున్న సిగ్నేచ‌ర్‌ బ్రిడ్జీ

రేపు ప్రారంభంకానున్న సిగ్నేచ‌ర్‌ బ్రిడ్జీ

  న్యూఢిల్లీ : భారత్‌లో మొట్టమొదటి అసిమ్మెట్రికల్‌ కేబుల్‌ స్టేయిడ్‌ బ్రిడ్జిగా గుర్తింపు పొందిన ఈ ఢిల్లీ బ్రిడ్జీని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఆదివారం ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 14 ఏళ్ల కిత్రం చేపట్టిన యమునా నదిపై నిర్మితమైన ఈ ఐకానిక్‌ బ్రిడ్జీ నవంబరు 5 నుండి ప్రజా వినియోగంలోకి రానున్నట్లు పేర్కొన్నారు. 575 మీటర్ల పొడవు, 35.2 మీటర్ల వెడల్పు కలిగి ఉన్న ఈ నిర్మాణం వల్ల వజీరాబాద్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సులభతరమౌతుందని అన్నారు. కాగా, ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు నిర్మించిన ఈ కేబుల్‌ బ్రిడ్జీకి సుమారు 1575 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు సమాచారం.