‘ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో ఈ దేశం బానిస’

‘ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో ఈ దేశం బానిస’

  న్యూఢిల్లీ : బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లోని ముగ్గురు, నలుగురు ఉన్నత స్థాయి వ్యక్తుల చేతిలో దేశం బానిసగా మారిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిపై ఐక్య ప్రతిపక్షం సమర్ధవంతంగా పోరాడుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది కాలంలో ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి తమ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శిస్తాయని అన్నారు. ఇక్కడి తల్కటారా ఇండోర్‌ స్టేడియంలో పార్టీ ఒబిసి విభాగంలో జరిగిన సదస్సులో రాహుల్‌ ప్రసంగించారు. ఒబిసిల మధ్య చిచ్చు పెట్టి వారి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఒబిసిలు, దళితులు, ఆదివాసీలు, ఇతర కులాల్లోని పేదలంతా ఏకతాటిపైకి రావాలని కోరారు. కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మొత్తంగా భారతదేశాన్ని పాలించలేరని ప్రభుత్వానికి తెలియచేసేలా చేస్తామని చెప్పారు.