రష్యా నుంచి వచ్చి భారతదశం లో బిక్షాటన

రష్యా నుంచి వచ్చి భారతదశం లో బిక్షాటన

కాంచీపురం: భారతదేశ అందాలను వీక్షించడానికి వచ్చిన రష్యా యువకుడు ఇక్కడ బిక్షాటన చేస్తు జీవనం సాగితున్న సంఘటన అందర్ని కలచివేసింది.తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో ఆలయం ఎదుట బిచ్చం ఎత్తుకుంటున్న రష్యా యువకుడి కథ దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. కొన్ని రోజులుగా అతను కాంచీపురం అమ్మవారి ఆలయం దగ్గర బిక్షాటన చేస్తున్నాడు.

రష్యాకు చెందిన 24 ఏళ్ల ఇవాంజెలిన్ టూరిజం వీసాపై భారతదేశం వచ్చాడు. అన్ని రాష్ట్రాలు తిరుగుతూ తమిళనాడు వచ్చాడు. కాంచీపురంలోని ఆలయాలు తిరిగాడు. సరిగ్గా అదే సమయంలో అతని అని ATM కార్డ్ ను బ్లాక్ చేసింది రష్యాలోని బ్యాంక్. సాంకేతిక కారణాలు అంటూ మెసేజ్ పంపింది.

చేతిలో డబ్బు లేదు…బ్యాంక్ అకౌంట్ పని చేయటం లేదు. దీంతో ఆకలితో సుబ్రహ్మణ్యస్వామి ఆలయం మెట్ల దగ్గర బిక్షాటన చేస్తూ కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. దీంతో కొంత ఆర్థికసాయం అందించారు పోలీసులు. చెన్నై వెళ్లి రష్యా ఎంబెసీని కలవాలని సూచించారు.

ఈ విషయం సోషల్ మీడియాలో చర్చ కావటంతో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూడా స్పందించారు. రష్యా అధికారులతో మాట్లాడి ATM కార్డు పని చేసేలా చూస్తానని అక్టోబర్ 10వ తేదీ రాత్రి ట్విట్టర్ ద్వారా హామీ ఇచ్చారు. చెన్నైలోని భారత అధికారులు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ఇవాంజెలిన్ కు భరోసా ఇచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని చెన్నై అధికారులను కూడా ఆదేశించారు మంత్రి సుష్మాస్వరాజ్