>

స‌రిహ‌ద్దుల్లొ బీఎస్ఎఫ్ జవాను ఆకలి వేదన

స‌రిహ‌ద్దుల్లొ బీఎస్ఎఫ్ జవాను ఆకలి వేదన

స‌రిహ‌ద్దుల్లొ బీఎస్ఎఫ్ జవాను ఆకలి వేదన

న్యూఢిల్లీ: బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్‌కు చెందిన ఓ జ‌వాను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వీడియో క‌ల‌క‌లం రేపుతోంది. స‌రిహ‌ద్దు వెంట నిత్యం ప‌హారా కాసే జ‌వాన్ల‌కు స‌రైన భోజ‌నం పెట్ట‌డంలేద‌ని బీఎస్ఎఫ్ జ‌వాను తేజ్‌బ‌హ‌దూర్ యాద‌వ్ ఆ వీడియోలో ఆరోపించాడు. ఆ వీడియోపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతున్న‌ది. వీడియోను వెంట‌నే తీసివేయాల‌ని జ‌వానుకు బెదిరింపు కాల్స్ వ‌చ్చాయి. అయినా అత‌ను బెద‌ర‌లేదు. విప‌త్క‌ర‌మైన వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో విధులు నిర్వ‌హించే త‌మ‌కు క‌డుపునిండా భోజ‌నం పెట్ట‌డం లేద‌ని జ‌వాను ఆ వీడియోలో తెలిపాడు. ఉన్న‌త అధికారులు భారీ అవినీతి పాల్ప‌డ‌డం వ‌ల్లే త‌మ‌కు ఆహారం దొర‌క‌డం లేద‌ని తేజ్‌బ‌హ‌దూర్ తీవ్రంగా ఆరోపించాడు. కానిస్టేబుల్ తేజ్‌బ‌హ‌దూర్ పోస్ట్ ఛేసిన వీడియోపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ద‌ర్యాప్తుకు ఆదేశించారు. జ‌వాను పోస్ట్ చేసిన వీడియోను చూశాన‌ని, బీఎస్ఎఫ్ నుంచి దానిపై నివేదిక తీసుకోవాలని హోంశాఖ కార్య‌ద‌ర్శిని ఆదేశించిన‌ట్లు మంత్రి తెలిపారు. 

జ‌వాను తేజ్‌బ‌హదూర్ మొత్తం మూడు వీడియోల‌ను పోస్ట్ చేశాడు. ఒక్కొక్క వీడియో నాలుగేసి నిమిషాలున్నాయి. 40 ఏళ్ల బ‌హ‌దూర్ యూనిఫామ్‌లోనే ఆ వీడియోను షూట్ చేశాడు. దాన్ని షూట్ చేసేందుకు అత్యంత సాహ‌సాన్ని ప్ర‌ద‌ర్శించాల్సి వ‌చ్చింద‌న్నారు. రైఫిల్‌తో ఉన్న అత‌ను 29వ బెటాలియ‌న్‌కు చెందిన‌ట్లు చెప్పాడు. అత్యంత క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో విధులు నిర్వ‌ర్తించే జ‌వాన్ల‌కు రుచిలేని, జ‌వ‌స‌త్వాలు లేని భోజ‌నాన్ని పెడుతున్న‌ట్లు ఆ వీడియోలో చూపించాడు. గంట‌లు, రోజుల కొద్దీ కాళ్ల మీద నిల‌బ‌డే త‌మ‌కు ఇలాంటి భోజ‌నం బ‌లాన్ని ఇవ్వ‌లేద‌న్నాడు. 

బ్రేక్‌ఫాస్ట్‌లో ప‌రాటా, టీ ఇస్తార‌ని, అందులో ప‌చ్చ‌డి కానీ కూర‌గాయ‌లు కానీ ఉండ‌వ‌న్నారు. లంచ్‌కు కేవ‌లం ప‌ప్పు, రోటి ఇస్తార‌న్నాడు. ఇలాంటి భోజ‌నంతో ఎలా విధులు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌శ్నించాడు. ఒక్కొక్క‌సారి ఖాళీ క‌డుపుతోనే తాము నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తామ‌న్నాడు. ప్ర‌భుత్వం కావాల్సినంత రేష‌న్ స‌ర‌ఫ‌రా చేసినా, దాన్ని మ‌ధ్య‌లోనే అధికారులు మింగేస్తున్నార‌ని ఆరోపించాడు. ఈ అంశంలో ప్ర‌ధాని మోదీ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని వీడియోలో ఆ జ‌వాను వేడుకున్నాడు. జ‌వాను పోస్ట్ చేసిన వీడియోపై బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్ స్పందించింది. గ‌తంలో ఓ అధికారిని బెదిరించ‌డం వ‌ల్ల అత‌నికి శిక్ష విధించామ‌ని, నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ విధుల్లో చేరిన అత‌ను ఇప్పుడు ఈ వీడియోతో ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని బీఎస్ఎఫ్ తెలిపింది. 

https://www.youtube.com/watch?v=s56ni-sctV8


Loading...