సల్మాన్ ఖాన్‌కు బెయిల్

సల్మాన్ ఖాన్‌కు బెయిల్

 జోధ్‌పూర్: కృష్ణ జింకల వేట కేసులో అయిదేళ్లు జైలు శిక్ష పడ్డ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్‌ను జోధ్‌పూర్ కోర్టు ఇచ్చింది. ఈ కేసులో దోషిగా తేలిన సల్మాన్‌ను గత రెండు రోజుల క్రితం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని జోధ్‌పూర్ జైలుకు తీసుకువెళ్లారు. ఇవాళ బెయిల్ పిటీషన్‌పై విచారణ జరిపిన తర్వాత సల్మాన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరీ చేశారు. 20 ఏళ్ల క్రితం ఓ ఫిల్మ్ షూటింగ్ కోసం జోధ్‌పూర్‌కు వెళ్లిన సల్మాన్ అక్కడ మిగతా నటులతో కలిసి కృష్ణ జింకల వేట చేశాడు. 

ఆ కేసులో మిగతా స్టార్స్‌కు ఊరట లభించినా.. సల్మాన్‌ను మాత్రం దోషిగా తేల్చారు. అయితే ఇవాళ కూడా బెయిల్ అంశంలో కొంత ఉత్కంఠ నెలకొన్నది. గత రాత్రి రాజస్థాన్ ప్రభుత్వం 87 మంది జడ్జిలను అకస్మాత్తుగా బదిలీ చేసింది. అందులో సల్మాన్ కేసును విచారిస్తున్న జడ్జి రవీంద్ర కుమార్ జోషి కూడా ఉన్నారు. కానీ చివరకు 50 వేల పూచీకత్తుపై బాలీవుడ్ స్టార్‌కు బెయిల్ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం 4.30 నిమిషాలకు జైలు నుంచి సల్మాన్ విడుదల కానున్నాడు.