స్కూల్‌ వ్యాన్‌ బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి

స్కూల్‌ వ్యాన్‌ బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి

 కొచ్చి : పాఠశాల నుంచి పిల్లలను ఇంటికి తీసుకువెళ్తున్న స్కూల్‌ వ్యాన్‌ నీటి గుంటలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులతో పాటు, పాఠశాలలో కేర్‌ టేకర్‌గా పని చేస్తున్న మహిళ కూడా మృతి చెందింది. కొచ్చిలోని మార్దాలో సోమవారం సాయత్రం 4.30 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు. ప్రమాదంలో వ్యాన్‌ డ్రైవర్‌కు, ఇతర విద్యార్థులకు తీవ్ర గాయలైయ్యాయి. ఘనట స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో వ్యాన్‌లో చిక్కుకున్న విద్యార్థులను రక్షించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మరణించిన విద్యార్థులను విద్య లక్ష్మి, ఆదిత్యాన్‌, కేర్‌ టేకర్‌ లతా ఉన్నిగా గుర్తించారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.