శ‌బ‌రిమ‌ల‌లో మ‌రోసారి ఉత్కంఠ‌

శ‌బ‌రిమ‌ల‌లో మ‌రోసారి ఉత్కంఠ‌

  కేర‌ళ : మాస‌పూజ‌ల కోసం శ‌బరిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం సోమ‌వారం కొన్నిగంట‌ల పాటు తెరుచుకోనుంది. దీంతో సుప్రీం కోర్టు తీర్పు నేప‌థ్యంలో అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకునేందుకు 10-50 ఏళ్ల వ‌య‌సు ఉన్న 70 నుంచి 80 మంది మ‌హిళ‌లు ఇప్ప‌టికే కొండ‌కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల విఫ‌ల‌మైనా స్వామిని సోమ‌వార‌మైనా ద‌ర్శించుకోవాల‌ని వారు ప్ర‌య‌త్నిస్తున్నట్లు స‌మాచారం. దీంతో శ‌బ‌రిమల‌లో మ‌రోసారి ఉత్కంఠ నెల‌కొన‌గా..ఆల‌య ప‌రిస‌ర‌ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్ష‌న్ విధించారు.