శ‌బ‌రిమ‌ల‌పై సుప్రీంకు వెళ్లాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించ‌లేం..

శ‌బ‌రిమ‌ల‌పై సుప్రీంకు వెళ్లాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించ‌లేం..

  కొచ్చి: శ‌బ‌రిమ‌ల‌లో జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు సుప్రీంకోర్టు తీర్పుకు వ్య‌తిరేక‌మ‌ని ఇవాళ కేర‌ళ హైకోర్టు తెలిపింది. శ‌బ‌రిమ‌ల‌లో ఆందోళ‌న నిర్వ‌హించ‌డం స‌రైంది కాదు అని హైకోర్టు పేర్కొన్న‌ది. తిరుప్ప‌నితుర గ్రామానికి చెందిన ఓ వ్య‌క్తి వేసిన పిటిష‌న్‌పై హైకోర్టు స్పందిస్తూ ఈ తీర్పునిచ్చింది. 10 నుంచి 50 ఏళ్ల వ‌య‌సు ఉన్న మ‌హిళ‌లు కూడా అయ్య‌ప్ప‌స్వామిని ద‌ర్శించుకోవ‌చ్చు అని సుప్రీం తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో కేర‌ళ‌లో ఆందోళ‌న‌లు జ‌రిగాయి. ట్రావ‌న్‌కోర్ దేవ‌స్థానం బోర్డు మాజీ ప్రెసిడెంట్ ప్ర‌యార్ గోపాల‌కృష్ణ‌న్ వేసిన పిటీష‌న్‌ను కూడా కేర‌ళ హైకోర్టు కొట్టివేసింది. టీడీబీ స‌భ్యుడు కేపీ శంక‌ర్‌దాస్‌ను తొల‌గించాల‌ని ఆయ‌న కోరారు. ఆల‌య ఆచారాల‌ను ఆయ‌న భ్ర‌ష్టుప‌ట్టిస్తున్నార‌ని ఆరోపించారు. కానీ ఆ పిటిష‌న్‌ను కూడా కోర్టు కొట్టిపారేసింది. శ‌బ‌రిమ‌ల తీర్పును వ్య‌తిరేకిస్తూ సుప్రీంలో స‌వాల్ చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించ‌లేమ‌ని కూడా హైకోర్టు పేర్కొన్న‌ది. దేవ‌స్థాన బోర్డును కూడా అలా కోర‌లేమ‌ని కోర్టు తెలిపింది.