సిక్కు మహిళలకు హెల్మెట్ల నుంచి మినహాయింపు

సిక్కు మహిళలకు హెల్మెట్ల నుంచి మినహాయింపు

  న్యూఢిల్లీ: సిక్కు మహిళలకు వాహనాలు నడిపేటపుడు హెల్మెట్ల వాడకం నుంచి చండీగఢ్ మినహాయింపునిచ్చింది. సిక్కు మతానికి చెందిన పలువురు పెద్దలు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి టూవీలర్ నడిపే సిక్కు మహిళలకు హెల్మెట్ల వాడకంపై మినహాయింపునివ్వాలని కోరారు. మరోవైపు అకాలీదళ్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ కూడా రాజ్‌నాథ్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. సిక్కు ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సిక్కు మహిళలకు హెల్మెట్ల వాడకంపై మినహాయింపు చట్టానికి సవరణలు చేశామని, ఢిల్లీ రవాణా శాఖ సూచనలు పాటించాలని చండీగఢ్ యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసినట్లు హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.