సిక్కుల పెళ్లికి కొత్త చట్టం..

సిక్కుల పెళ్లికి కొత్త చట్టం..

. న్యూఢిల్లీ: సిక్కు మతస్థులు ఇక తమ వివాహాన్ని .. ఆనంద్ వివాహ చట్టం కింద రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆనంద్ మ్యారేజ్ రూల్స్‌కు ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. గతంలో దేశ రాజధానిలో ఉన్న సిక్కులు తమ పెళ్లిళ్లను హిందూ వివాహ చట్టం కింద నమోదు చేసుకునే వారు. అయితే చాన్నాళ్లుగా సిక్కులు.. ఆనంద్ వివాహ చట్టానికి అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న వివాహా చట్టానికి పచ్చజెండా ఊపినట్లు ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్ తెలిపారు. ఇప్పటివరకు సిక్కు మతస్తులు తమ పెళ్లిని ఆనంద్ కరాజ్ సంప్రదాయం ప్రకారం చేసుకునేవారు. కానీ ఆ మ్యారేజ్‌ను హిందూ వివాహ చట్టం కింద రిజిస్టర్ చేసేవాళ్లు. ఇక నుంచి ఆ సమస్య ఉండదని మంత్రి పేర్కొన్నారు.