శ్రీనగర్‌లో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదలు దాడి

శ్రీనగర్‌లో ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదలు దాడి

  శ్రీనగర్‌ : జమ్ము-కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను, పుల్వామాకు చెందిన పౌరుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాకాపొరాలోని ఆర్మీకి చెందిన 50 రాష్ట్రీయ రైఫిల్స్‌ కాంప్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడగా, భద్రతా సిబ్బంది దీటుగా ఎదుర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో విక్రమ్‌ సింగ్‌ అనే జవాను, బిలాల్‌ అహ్మద్‌ అనే వ్యక్తి మృతి చెందినట్లు శ్రీనగర్‌ కల్నల్‌ రాజేష్‌ కాలియా తెలిపారు. కాగా, ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతనాగ్‌లో జె-కె తెహ్రిక్‌ బచావో పార్టీకి చెందిన ఒక రాజకీయ నాయకుడిని కాపాడే ప్రయత్నంలో భద్రతా సిబ్బంది శనివారం ఇద్దరు ఉగ్రవాదులను, రెండు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. రంజాన్‌ సందర్భంగా కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుండి ఉగ్రవాదులు నాలుగుసార్లు గ్రేనెడ్‌ దాడులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.