శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌

   శ్రీనగర్‌: జమ్ము-కాశ్మీర్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో శనివారం ఉదయం ఒక జవాను గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. శ్రీనగర్‌లోని చట్‌బల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సెర్చె ఆపరేషన్‌ కొనసాగిస్తుండగా, కాల్పులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఒక జవాను గాయపడినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో కొందరు ఉగ్రవాదులు రాళ్లు రువ్వుతున్నట్లు నివేదికలు అందాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సెర్చ్‌ ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.