శ్రీనగర్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌

శ్రీనగర్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌

   శ్రీనగర్‌ : జమ్ము కాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో కొకెర్‌నాగ్‌ ప్రాంతంలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకున్న అధికారులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారని, అదేసమయంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులు కొనసాగిస్తోందని, అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుందన్నారు. ఉగ్రవాదులకు సంబంధించిన నాలుగు రహస్యస్థావరాలను గుర్తించారని, అక్కడి నుండి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఆగస్ట్‌ 12న బాటామల్లూ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాను మృతిచెందగా, నలుగురికి గాయాలైన సంగతి తెలిసిందే.