సుప్రీం ఆదేశాలు ఉల్లంఘించిన‌ 1300 మందిపై కేసులు న‌మోదు

సుప్రీం ఆదేశాలు ఉల్లంఘించిన‌ 1300 మందిపై కేసులు న‌మోదు

  త‌మిళ‌నాడు : సుప్రీం కోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘించిన‌ ప‌లువురిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. దీపావ‌ళి రోజు ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు. రాత్రి 7 గంట‌ల నుంచి 8 గంట‌ల మ‌ధ్య బాణాసంచా కాల్చుకోవ‌డానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనేప‌థ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన 1300 మందిపై కేసులు న‌మోదు చేశారు. చెన్నైలో 350 మందిపై కేసులు, ప‌లువురు అరెస్టు. విల్లుపురం జిల్లాలో 50 మందిపై కేసులు న‌మోదు చేశారు. ఐపీసీ 188, 285 సెక్ష‌న్ల కింద పోలీసులు కేసులు న‌మోదు చేశారు.