‘స్వార్థం కోస‌మే కాంగ్రెస్‌తో జ‌తక‌ట్టారు’

‘స్వార్థం కోస‌మే కాంగ్రెస్‌తో జ‌తక‌ట్టారు’

  హైదరాబాద్: తెలంగాణ కోసం, అభివృద్ధి కోసం, మార్పు కోసం అంటూ ప్రధాని నరేంద్రమోడీ తన ప్రసంగం ప్రారంభించారు. ఎల్బీ నగర్ స్టేడియంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... తెలంగాణ అంటే, హైదరాబాద్ అంటే తనకు ఇష్టమని చెప్పారు. సర్దార్ పటేల్ అంటే ఇష్టమన్నారు. ఇంత వరకూ ఆయన తెలుగులో మాట్లాడి తదుపరి ప్రసంగాన్ని ఇంగ్లీషులో కొనసాగించారు.

హైదరాబాద్ కు ఎప్పుడు వచ్చినా తనకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు వస్తారన్నారు. ఆనాడు పటేల్ వల్లే హైదరాబాద్ కు విముక్తి కలిగిందన్నారు. దేశంలో వంశపార పార్టీలు ఎక్కువైపోయాయని.. కర్త, కర్మ, క్రియ కుటుంబాలే వ్యవహరిస్తాయని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యానికి నష్టం తెచ్చే పార్టీలు కావాలా వద్ద అన్నది ప్రజలే తేల్చుకోవాలన్నారు. టిడిపి పుట్టింది తెలుగువారి ఆత్మాభిమానం నుంచ‌ని, కానీ స్వార్థం కోసం కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టార‌ని ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు.