ట్యుటికోరన్‌ విమానాశ్రయంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు

ట్యుటికోరన్‌ విమానాశ్రయంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు

 చెన్నై : రీసెర్చ్‌ విద్యార్ధిని లూయిస్‌ సోఫియా (28) ఒక్క ట్వీట్‌తో తాను జైలు పాలవుతానని ఎన్నడూ ఊహించి వుండదు. ఫాసిస్ట్‌ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేస్తే ఏమవుతుంది?, ఈ విమానం నుండి నన్ను బయటకు గెంటేస్తారా? అంటూ ప్రశ్నించింది. అలా ప్రశ్నించిన కొద్ది గంటల తర్వాత సోఫియా అరెస్టయ్యారు. ఐపిసి సెక్షన్‌ 290 కింద ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారనే అభియోగాలు ఆమెపై మోపారు. తమిళనాడు నగర పోలీసు చట్టం-1988లోని సెక్షన్‌ 75(1)(సి) కింద పౌర శాంతికి భంగం కలిగించారని పేర్కొన్నారు. ఇంతకీ సంగతేమిటంటే తాను ప్రయాణిస్తున్న విమానంలోనే తమిళనాడు బిజెపి చీఫ్‌ కూడా వున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఏమవుతుందో చూస్తానంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ఆ వెంటనే గట్టిగా నినాదాలు చేసి అరెస్టయ్యారు. 15రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపారు. ఆ తర్వాత తూత్తుకుడి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.