‘విద్యార్థులకు సామాజిక సేవ అలవర్చాలి’

‘విద్యార్థులకు సామాజిక సేవ అలవర్చాలి’

   బెంగళూరు : విద్యార్థులకు సామాజిక సేవను తప్పనిసరిగా నేర్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం సూచించారు. విద్యార్ధులకు నైతికతను, విలువలను బోధించాలని ఉపాధ్యాయులను కోరారు. విపి దీనదయాళు నాయుడు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్ధులకు డిగ్రీలు ప్రదానం చేసేందుకు ఎన్‌ఎస్‌ఎస్‌, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ వంటి స్వచ్ఛంద సంస్ధల ద్వారా విద్యార్ధులకు సామాజిక సేవను అలవాటు చేయాలన్నారు. సామాజిక సేవ వలన విద్యార్ధులలో అందరం ఒకటేనన్న స్ఫూర్తి కలుగుతుందని, జాతీయవాదం, సామాజిక స్పృహ అలవడతాయని ఆయన చెప్పారు. నైతిక శాస్త్రాన్ని స్కూలు సిలబస్‌లో చేర్చాలన్నారు. దీనివల్ల వేలాది మంది విద్యార్థులు లబ్ది పొందుతారని చెప్పారు.