విమాన ఇంధనం దొంగలు అరెస్ట్‌

విమాన ఇంధనం దొంగలు అరెస్ట్‌

 న్యూఢిల్లీ : యమునా ఎక్స్‌ప్రెస్‌వే (ఆరులైన్ల రోడ్డుమార్గం) నుండి విమాన ఇంధనాన్ని దొంగిలించడానికి యత్నించిన ఎనిమిదిమందిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. గ్రేటర్‌ నొయిడా నుండి నుండి ఆగ్రా వరకు ఉండే ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో మధుర వద్ద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. విమానాలలో అత్యవసరంగా ఇందనాన్ని నింపేందుకు గాను ఫ్రెంచ్‌ డస్సాల్ట్‌ మిరేజ్‌ -2000ను మధురకు సమీపంలోని రాయ్‌ గ్రామంలో నెలకొల్పారు. ఈ ప్రదేశం నుండి వారు ఇంధనాన్ని దొంగిలించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారి నుండి నాలుగు టాంకర్స్‌, ట్రాక్టర్లు, డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.