విమానాల్లో అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు

విమానాల్లో అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు

 ఢిల్లీ: విమానాల్లో ప్రయాణికులు ఇకపై అనుచితంగా ప్రవర్తిస్తే వారి విమాన ప్రయాణాలపై జీవితకాలం పాటు నిషేధం వేటు పడనుంది. అనుచిత ప్రవర్తనను బట్టి శిక్ష మూడు నెలల నుంచి జీవితకాలంపాటు నిషేధం వరకు ఉంటుందని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. నిషేధానికి సంబంధించి పౌరవిమానయానశాఖ కేంద్రానికి మూడు ప్రతిపాదనలు చేసింది. వీటికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. విమాన సిబ్బందితో ప్రయాణికులు అసభ్యపదజాలంతో మాట్లాడితే మూడు నెలల వరకు నిషేధం విధిస్తారు. సిబ్బందిపై చేయి చేసుకుంటే ఆరు నెలలు.. సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసేవిధంగా ప్రవర్తిస్తే రెండేండ్లు లేదా జీవితకాలం నిషేధం విధిస్తారు. విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనపై పైలట్ అంతర్గత కమిటీకి నివేదిస్తారు. ఆ కమిటీ విచారణ జరిపి 30 రోజుల్లో నిర్ణయం తీసుకుంటుంది.