వివాహేతర సంబంధాలు నేరం కాదు

వివాహేతర సంబంధాలు నేరం కాదు

  న్యూఢిల్లీ : వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. విడాకులకు దారి తీసే అవకాశం ఉన్నా, ఇద్దరు వ్యక్తులు ఇష్ట పూర్వకంగా లైంగిక సంబంధాలు కలిగి ఉంటే నేరం కాదని గురువారం స్పష్టం చేసింది. ఐపిసి సెక్షన్‌లోని 497ను రాజ్యాంగ విరుద్ధమని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రకటించింది. స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అని వివాహేతర సంబంధాల్లో మహిళకు శిక్షార్హురాలు కావడం లేదని కేరళకు చెందిన జోసెఫ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ తీర్పునిచ్చింది. జస్టిస్‌ ఖాన్విల్కర్‌ తరుపున సిజె మిశ్రాతో కూడిన బెంచ్‌ నాలుగు ప్రత్యేక తీర్పులను రచించింది. వివాహా పవిత్రతను రక్షించడానికి ఐపిసి సెక్షన్‌ 497ను కొనసాగించాల్సిందేనని కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవిచంలేదు. వ్యక్తి అతనికి తెలిసిన మహిళతో కానీ, పరాయి వ్యక్తి భార్యతో ఇష్టపూర్వకంగా పరస్పర లైంగిక సంబంధాలు కొనసాగిస్తే దానిని నేరంగా పరిగణించమని పేర్కొంది. మహిళకు భర్త అధికారి కాదని, మహిళల అసమానతలకు అడ్డుపడే ఈ నిబంధన అయినా రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది. మహిళలకు కూడా సమాన హక్కులు ఉంటాయని, ఈ చట్టం మహిళల లైంగిక స్వేచ్ఛను హరిస్తుందని పేర్కొంది. సెక్షన్‌ 497 ప్రకారం మహిళతో శారీరక సంబంధం కొనసాగిస్తున్న పురుషుడికి సుమారు ఐదేళ్ల జైలు శిక్ష లేక జరిమానా లేక ఈ రెండూ వర్తిస్తాయి.