వాట్సప్‌లో నకిలీ వార్తలకు చెక్‌పెట్టే చర్యలు తీసుకోండి!

వాట్సప్‌లో నకిలీ వార్తలకు చెక్‌పెట్టే చర్యలు తీసుకోండి!

 ముంబయి : ఇటీవల కాలంలో వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాలలో నకిలీ వార్తలు సర్క్యులేట్‌ అవుతూ పలు నేరాలకు దారితీస్తున్న నేపత్యంలో కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మంగళవారం వాట్సప్‌ సిఇఓ క్రిస్‌ డానియల్‌తో భేటీ అయ్యారు. నకిలీ వార్తల సర్క్యులేషన్‌ను అరికట్టేందుకు తీసుకోవలసిన పలు చర్యలను సూచించారు. దేశ ప్రజలకు వాట్సప్‌ ప్రయోజనకరమైనదే అయినప్పటికి, దాని వల్ల కొన్ని విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, మూక హత్యలు వంటి నేరాలకు ప్రేరేపిస్తున్నాయని ప్రసాద్‌ తెలిపారు. డానియల్‌తో జరిగిన సమావేశం ఫలవంతంగా ముగిసిందని ఆయన చెప్పారు. వాట్సప్‌లో వస్తున్న నకిలీ వార్తలతో దేశ చట్టాలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు తగిన పరిష్కారాలు కనుగొనాల్సి ఉందన్నారు.