యుపిలో ఇసుక తుపాను-17మంది మృతి

యుపిలో ఇసుక తుపాను-17మంది మృతి

 లక్నో : ఉత్తరప్రదేశ్‌ల శుక్రవారం సాయంత్రం సంభవించిన ఇసుక తుపాను వల్ల 17మంది మరణించగా, మరో 11మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రతినిధి శనివారం తెలిపారు. చెట్లు విరిగిపడడం, ఇళ్ళు కూలడం వల్ల ఎక్కువ మరణాలు సంభవించాయని ఆయన చెప్పారు. మురదాబాద్‌ జిల్లా ప్రధానంగా ఈ తుపానుకు ఎక్కువగా దెబ్బతింది. ఈ జిల్లాలో ఏడుగురు మరణించారు. సంబాల్‌లో ముగ్గురు చనిపోయారు. బదాన్‌, ముజఫర్‌నగర్‌, మీరట్‌ల్లో ఇద్దరేసి చొప్పున మృతి చెందారు. అంరోహాలో ఒకరు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారు. మురదాబాద్‌లో ముగ్గురు, ముజఫర్‌నగర్‌, బదాన్‌ల్లో వరుసగా ఇద్దరు, ఒకరు గాయపడ్డారు. 24గంటల్లోగా బాధితులక సహాయం అందాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మేజిస్ట్రేట్లను ఆదేశించింది. గత నెల్లో మూడు తుపానులు ఉత్తరప్రదేశ్‌ను అతలాకుతలం చేయగా, 130మంది మరణించారు