యువతి పెళ్లికి టీచర్లు ఆర్థికసాయం

యువతి పెళ్లికి టీచర్లు ఆర్థికసాయం

  భోపాల్ : ఓ పేదింటి యువతి పెళ్లికి టీచర్లు అండగా నిలిచారు. నీకు మేమున్నామంటూ.. భరోసానిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. మధ్యప్రదేశ్‌లోని విదిషా పట్ణణంలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువతి పెళ్లికి స్థానికంగా ఉన్న టీచర్లు ఆర్థికంగా సాయం చేశారు. తమ జీతాల నుంచి ప్రతీ నెల కొంత డబ్బు జమ చేసి.. ఆ అమ్మాయి పెళ్లికి అందజేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచి.. ఆ కుటుంబాల్లో భరోసా నింపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీచర్లు చెప్పారు. భవిష్యత్‌లో కూడా నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు తమ వంతు ఆర్థికసాయం చేస్తామని టీచర్లు తెలిపారు. టీచర్లు చేసిన ఈ గొప్ప పనికి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.