ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు

ఢిల్లీ: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(EIL) మొత్తం 229 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. హెడ్ ఆఫీస్, రీజినల్ కార్యాలయాల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్/టెక్నీషియన్ అప్రెంటిస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది.

వివరాలు:ఢిల్లీలోని హెడాఫీస్‌తోపాటు రీజినల్ ప్రాంతాలైన గుర్‌గావ్, చెన్నై, వడోదర, కోల్‌కతా, ముంబైలలో1961 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం శిక్షణ ఇస్తారు.మొత్తం ఖాళీల సంఖ్య – 229 (ట్రేడ్ అప్రెంటిస్-179, ట్రేడ్/టెక్నీషియన్ అప్రెంటిస్-50)విభాగాల వారీగా ఖాళీలు.

ట్రేడ్ అప్రెంటిస్‌లు:

సెక్రటేరియల్ అసిస్టెంట్/స్టెనోగ్రాఫర్- 32, అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ / ITIలో ఉత్తీర్ణత.

అకౌంటెంట్/హెచ్‌ఆర్ అసిస్టెంట్- 24 , అర్హత: బీఏ, బీబీఏ, బీకాంలో ఉత్తీర్ణత,

డ్రాఫ్ట్స్‌మ్యాన్- 39 (సివిల్- 17, మెకానికల్- 17, ఎలక్ట్రికల్- 5), అర్హత: ఎస్‌సీవీటీ/ఎస్‌సీవీటీ నుంచి సివిల్/మెకానికల్, ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగంలో ఐటీఐ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
రిసెప్షనిస్ట్- 8 , అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/ITI లో ఉత్తీర్ణత.
ల్యాబ్ అసిస్టెంట్/ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్- 25, అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పదోతరగతి, ITI, బీఎస్సీలో ఉత్తీర్ణత.
స్టీవార్డ్- 7 , అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/ ITI లో ఉత్తీర్ణత
లైబ్రెరీ అసిస్టెంట్- 5, అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఏ, బీకాం, బీఎస్సీలో ఉత్తీర్ణత.
హార్టికల్చర్ అసిస్టెంట్-3, హౌస్ కీపర్ కార్పొరేట్-14, క్యాబిన్/రూమ్ అటెండెంట్-22, విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతిలో ఉత్తీర్ణత.

టెక్నీషియన్ అప్రెంటిస్‌లు..సివిల్-10, మెకానికల్-10, ఎలక్ట్రికల్-5, కెమికల్- 10, ఆర్కిటెక్చర్- 5, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్- 5, కంప్యూటర్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 5

అర్హత: గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు నుంచి సంబంధిత సబ్జెక్టులో మూడేండ్ల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత.
వయస్సు: 2017, నవంబర్ 28కు 18 ఏండ్లు నిండి ఉండాలి.
శిక్షణా కాలం: వివిధ ట్రేడ్ అప్రెంటిస్‌ల బట్టి 12 లేదా 15 నెలలు/ రెండేండ్లు ఉంటుంది. ట్రేడ్ టెక్నీషియన్ అప్రెంటిస్‌కు ట్రైనింగ్ ఏడాది.
స్టయిఫండ్: ట్రైనింగ్ లో రూ. 10,000-14,000/- ప్రదేశాన్ని బట్టి స్టయిఫండ్ చెల్లిస్తారు.
అభ్యర్థులు బోర్డు ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్/రీజినల్ డైరెక్టరెట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేదీ: నవంబర్ 28
వెబ్‌సైట్: www.engineersindia.com