10 మిలియన్‌ యుఏఇ దిర్హాలను గెలుచుకున్న భారతీయుడు

10 మిలియన్‌ యుఏఇ దిర్హాలను గెలుచుకున్న భారతీయుడు

  దుబాయ్‌ : కేరళాకు చెందిన బ్రిట్టీ మార్కోస్‌ అనే వ్యక్తి యుఏఇలో నెలవారి రఫెల్‌ డ్రాలో 10 మిలియన్‌ దిర్హాలను (2.72 మిలియన్‌ డాలర)్లను ఆదివారం గెలుచుకున్నాడు. అబుదాబీలో డ్రాఫ్టమెన్‌గా పనిచేసే బ్రిట్టీ 2004 నుండి దుబారులో ఉంటూ, తనకున్న అప్పులను తీర్చుకునేందుకు పెద్ద మొత్తంలో రఫెల్‌ టికెట్‌లను కొంటున్నట్లు తెలిపాడు. అయితే టికెట్టు కొనడం ఇది ఐదోసారని చెప్పాడు. తన భార్య, ఇద్దరు కుమారులు కేరళలోనే ఉన్నారని, అప్పులను తీర్చుకుని ఓ ఇల్లు కట్టుకోవడం కోసం ఆ డబ్బును వినియోగిస్తానని చెప్పాడు. గెలుపొందిన వారిలో తొమ్మిది మంది భారతీయులు, ఒక పాకిస్థానీ ఉన్నారు.