>

ఐరాసలో అగ్రస్థానం

ఐరాసలో అగ్రస్థానం

 ఈ బోర్డులో స్థానం దక్కించుకున్న మొదటి భారతీయురాలు నీరు చదా. 2017 నుంచి 2026 వరకు తొమ్మిదేళ్లు న్యాయమూర్తిగా ఈ పదవిలో ఆమె కొనసాగుతారు. జర్మనీలోని హంబర్గ్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఈ బోర్డులో 21 మంది సభ్యులు ఉంటారు. సముద్ర చట్టాలపై పూర్తి అవగాహన, గుర్తింపు పొందిన వారిని ఈ బోర్డులో సభ్యులు (న్యాయమూర్తు)గా ఎన్నుకుంటారు. 

సముద్ర జలాలకు సంబంధించి ఎంతో కీలకమైన ఈ ఎన్నికల్లో రెండో రౌండ్‌లోనే 120 ఓట్ల మెజార్టీతో నీరు చదా గెలుపొందారు. గతంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారుగా ఎంపికైన తొలి మహిళ నీరూ చదా. అంతేకాదు ఐక్యరాజ్య సమితి నిర్వహించిన పలు సమావేశాల్లో కూడా భారత్ తరఫున నీరు హాజరయ్యారు. మార్షల్ దీవుల్లో అణ్వాయుధ పోరాటాలు, అణు నిరాయుధీకరణకు సంబంధించిన చర్చల్లో అంతర్జాతీయ న్యాయస్థానం తరఫున ఏజెంట్‌గా పాల్గొన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం, మిచిగాన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ పొందారు. 

యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలిగా పనిచేసిన విజయలక్ష్మీ పండిట్ తర్వాత.. ఐరాసలో అగ్రస్థానంలో ఉన్న రెండో భారతీయ మహిళగా నీరూ చదా చర్రిత సృష్టించారు. 2012లో కేరళకు చెందిన ఇద్దరు మత్స్యకారులపై ఇటాలియన్ నావికులు కాల్పులు జరిపారు. ఈ వివాదానికి సంబంధించి ఇటలీ అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసును దాఖలు చేసింది. ఈ కేసులో భారత ప్రభుత్వం తరఫున ప్రధాన న్యాయవాదిగా నీరు చదా వాదించారు. సముద్ర జలాలకు సంబంధించిన ఇలాంటి ఎన్నో కేసులను భారత ప్రభుత్వం తరఫున చదా వాదించారు.


Loading...