అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య

అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య

  న్యూయార్క్ : అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భారత సంతతి వ్యక్తి ఆకాశ్ ఆర్ తలాటి(40) హత్యకు గురయ్యారు. ఓ క్లబ్ బయట సెక్యూరిటీ గార్డుకు, మరో వ్యక్తి మధ్య కాల్పులు జరుగుతుండగా ఆ సమయంలో తలాటితోపాటు మరికొందరు అక్కడ నిల్చొని ఉన్నారు. అయితే ఓ బుల్లెట్ తలాటికి తాకింది. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. తలాటి స్వస్థలం గుజరాత్. ఆయన అమెరికాలో హోటల్ వ్యాపారం చేస్తున్నారు. మరోవైపు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన తలాటి కుటుంబానికి అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.