అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దుర్మరణం

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి దుర్మరణం

 జీడిమెట్ల: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి అక్కడ మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్‌నగర్ డివిజన్‌లోని సూరారం కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సూరారంకాలనీ సుందర్‌నగర్‌లో నివసిస్తున్న బీ జాకబ్‌కు కుమారుడు నాగ తులసీరామ్, కూతురు స్ఫూర్తి ఉన్నారు. రెండేండ్ల క్రితం నాగ తులసీరామ్ (26)ను ఎమ్మెస్ చదివించేందుకు జాకబ్ అమెరికాకు పంపించారు బ్రిడ్జిపొర్ట్ యూనివర్సిటీలో తులసీరామ్ ఎమ్మెస్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి కనెక్టికట్ రాష్ట్రంలోని వాటర్‌బర్లీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసీరామ్ మృతిచెందినట్టు అతడి స్నేహితుడు శివ తండ్రి జాకబ్‌కు సమాచారం అందించాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.