ఆస్ట్రేలియా లో టీఆర్ఎస్ విజయోత్సవ సంబరాలు...

ఆస్ట్రేలియా లో టీఆర్ఎస్ విజయోత్సవ సంబరాలు...

  ఆస్ట్రేలియా లోని సిడ్నీ లో టీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. నూతన యువ నాయకుడు కేటీఆర్ కు అభినందలు తెలిపారు. ప్రవీణ్ పిన్నమ అద్వర్యం లో సిడ్నీ లో టిఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ కల్పించటంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారితో గెలిపించిన సందర్భంలో, కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గ ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు.

నవతరానికి కేటీఆర్ లాంటి యువ నాయకత్వం ఆవశ్యకత ఉందని , సరైన సమయం లో సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు . దేశ రాజకీయాల ప్రక్షాళనకి, గుణాత్మకమైన మార్పులకు కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తూ నాయకత్వ బాధ్యతలను కేటీఆర్ కు అప్పజెప్పడంతో తెలంగాణ యువత నేటి రాజకీయాలవైపు అలోచించి కొత్త తరం పుట్టుకొచ్చి రాజకీయాల పై ఉన్న చెడు అభిప్రాయం తొలగి రాజకీయాలపై గౌరవం పెరుగుతుందని తెలిపారు. అలాగే విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ విజయంకోసం గత మూడు నెలలుగా విశేష కృషిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. టిఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల గారి సూచనలతో తమ శాఖ సభ్యులు ఇంతటి అఖండవిజయంలో కీలక పాత్ర పోషించారని, రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి, తెలంగాణ ప్రగతిని ప్రజలకు వివరించటంతోపాటు, చరవాణిద్వారా వేల సంఖ్యలో ఓటర్లతో మాట్లాడి టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ముఖ్య సభ్యులైన రవి శంకర్ , సంగీత ధూపాటి , లక్ష్మణ్ నల్లాన్, పరశురామ్ , వరుణ్ , మాధవ్ కటికనేని , రవి సూరిశెట్టి ,జైపాల్ రెడ్డి , రవీందర్ , సుజాత , మధు రావు ఏటీఎస్ఏ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.