బుర్కినాఫాసోలో భారతీయుడి  కిడ్నాప్‌

బుర్కినాఫాసోలో భారతీయుడి  కిడ్నాప్‌

 ఒగడొగు(బుర్కినాఫాసో) : మాలి, నైజర్‌కు సరిహద్దుల్లో ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌కు గురయ్యారని భద్రతా వర్గాలు తెలిపాయి. వారి సహచర గని కార్మికుడు ఈ కిడ్నాప్‌లను ధృవీకరించారు. ఇనాటా బంగారు గనిలో వీరు పని చేస్తున్నారు. ఉదయం 8గంటలకు ఆ ముగ్గురు గని ప్రాంతం నుండి వెళ్లారని 10గంటలు దాటినా రాలేదని, వారి దగ్గర నుండి ఎలాంటి సమాచారం కూడా లేదని ఆ కార్మికుడు వివరించారు. దాంతో తాము రక్షణ, భద్రతా బలగాలను అప్రమత్తం చేశామని, వారు కిడ్నాప్‌ అయినట్లు అప్పుడు తెలిసిందని పేరు చెప్పడానికి వెల్లడించని ఆ కార్మికుడు చెప్పాడు. కిడ్నాపైన వారిలో ఒక భారతీయుడు, దక్షిణాఫ్రికా జాతీయుడు, మరొకరు బుర్కినాబీ జాతీయుడు వున్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. కిడ్నాపర్లు జిహాదీ గ్రూపు సభ్యులై వుండవచ్చని, వారు మాలి సరిహద్దు దిశగా వెళ్ళినట్లు తెలుస్తోందని ఆ వర్గాలు చెప్పాయి.