కెనడాలో అత్యంత వైభవం...దీపావళి ఉత్సవాలు

 కెనడాలో అత్యంత వైభవం...దీపావళి ఉత్సవాలు

  తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా) ఆద్వర్యంలో నవంబర్ 10 వ తేది 2018 శనివారం రోజున బ్రాంప్టన్ నగరంలోని చెంగోస్కి సెకండరీ స్కూల్లో సుమారు 1000 మందికి  పైగా తెలుగు వారు పాల్గొన్నా‌రు.  దీపావళి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుక అచ్చ తెలుగు సాంప్రదాయ పద్దతులతో దాదాపు 5 గంటలపాటు వివిధ‌ సాంస్కృతిక కార్యక్రమాలతొ సభికులను అలరించాయి. ఈ స౦దర్బ౦లో 25 కి పైగా చక్కటి సా౦స్కృతిక కార్యక్రమాలు తాకా ఆద్వర్య౦లో జరుగగా ఇ౦దులో కెనడా స్థానిక తెలుగువారు పాల్గొన్నారు. తాకా వారు చక్కటి రుచికరమైన తెలుగు భోజన౦ ఏర్పాటు చేశారు.  

తాకా కార్యదర్శి శ్రీ నాగేంద్ర హంసాల ఆహ్వానించగా, శ్రీమతి భాను సూరపనేని, శ్రీమతి మీనా ముల్పూరి, శ్రీమతి దీపా సాయిరాం, శ్రీమతి రంజిత హంసాల, శ్రీమతి వెంకట రత్నం కల్లూరి మరియు శ్రీమతి సత్యవతి గార్లు జ్యోతి ప్రజ్వలన చేశారు.. ఇండియా మరియు కెనడా జాతీయ గీతాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ దీపావళి వేడుకలలో దాదాపు వంద మంది టొరంటోలో నివసిస్తున్న చిన్నారులు, యువత మరియు పెద్దలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ వేడుకలో కూచిపూడి, భరతనాట్యం , కథాకళి , జానపద, సినిమా గీతాలు, నృత్యా లు, మరియు నాటికలు చిన్నపిల్లల నుండి పెద్దల వరుకు పాల్గొని ప్రేక్షకులను వారి ప్రతిభ సామర్థ్యాలతో ఉర్రుతలూగించారు. సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిని శ్రీమతి వాణి జయంత్ మరియు శ్రీమతి దీప సాయిరాం గార్ల పర్యవేక్షణ లో నిర్వహించబడినాయి. 

 తాకా అధ్యక్షులు శ్రీ అరుణ కుమార్ సభికులను ఆహ్వానించి, ఈ సంవత్సరములో తాకా చేసిన కార్యక్రమాలను వివరి౦చారు. తాకా అత్యధిక జీవిత సభ్యుల గల సంస్థగా , అత్యధిక దాతలున్న సంస్థగా, అత్యధిక కార్యక్రమాలు జరుపుతున్న సంస్థగా కెనడాలో తెలుగు స౦స్కృతి, సా౦ప్రదాయలను ము౦దుతరాల వారలకు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చారి సామంతపూడి తాకా వ్యవస్థాపకతను గురించి వివరిచారు. సెప్టెంబర్ లో జరిగిన తాకా ఇండోర్ స్పోర్ట్స్ కార్యక్రమంలోని విజేతలకు కార్యవర్గం బహుమతులు అంద చేసారు. ఈ వేడుకలో తానా కెనడా ప్రతినిధి శ్రీ లక్ష్మినారాయణ సూరపనేని గారు మరియు తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ వేడుకను ఎంతో అద్భుతం గా చేపట్టి మరియు విజయవంతం చేసిన కోశాధికారి శ్రీమతి కల్పన మోటూరిని, ఫుడ్ కమిటీ ఇంచార్జి శ్రీ సురేష్ కూన ని, కల్చరల్ ఇంచార్జి శ్రీమతి దీపా సాయిరాంని, డైరెక్టర్ శ్రీ రాఘవకుమార్ అల్లంను, ట్రస్టీ ఛైర్మన్ శ్రీ లోకేష్ చిల్లకూరును, ట్రస్టీ సభ్యులు శ్రీ భాషా షేక్ ని , శ్రీ రాంబాబు కల్లూరిని, శ్రీ కిరణ్ కాకర్లపూడి, మరియు శ్రీ ఆర్నాల్డ్ రామానుజులు మద్దెల ను తాకా అధ్యక్షులు అభినందించారు. తాకా వ్యవస్థాపక సభ్యులు శ్రీ శ్రీనాథ్ కుందూరు, శ్రీ రామచంద్రరావు దుగ్గిన, శ్రీ రమేష్ మునుకుంట్లను మరియు పూర్వ అధ్యక్షులు శ్రీ గంగాధర్ సుఖవాసి, చారి సామంతపూడి గార్లు వేడుకను పర్యవేక్షించారు. చివరిగా తాకా ఉపాధ్యక్షులు శ్రీ రామచంద్రరావు దుగ్గిన తాకా పోషక కర్తలకు, తాకా సభ్యులకు మరియు వాలంటీర్లందరికి వేడుక విజయవంతము చేసినందులకు ధన్యవాదములు తెలియచేశారు.