దక్షిణాఫ్రికాలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

దక్షిణాఫ్రికాలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

  జోహన్నెస్‌బర్గ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (టాసా)ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు తాలూకా ఉమ్జి, ఇంద్రవెల్లి అటవీ ప్రాంతాల పరిధిలో గిరిజనులు చేసే మధురి జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా శ్రావణమాసంలో నిర్వహించే కృష్ణాష్ఠమిని పురస్కరించుకుని మహిళలు, పురుషులు, చిన్నారులు బృందాలుగా వివిధ రకాల నృత్యప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టాసా అధ్యక్షుడు వెల్తపు భూమయ్య, తల్లూరి శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, నర్సి ఇతర సభ్యులు పాల్గొన్నారు.