ఉగాండాలో వైకుంఠ ఏకాదశి పర్వదినం

ఉగాండాలో వైకుంఠ ఏకాదశి పర్వదినం

  కంపాలా: ఉగాండా రాజధాని కంపాలాలోని తిరుమల తిరుపతి దేవస్తానంలో ఇవాళ తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఉగాండా ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం కార్యక్రమం జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన అనేక మంది భక్తులు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఉదయం 4 గంటలకు అభిషేకం, తిరుప్పవాయి సేవలతో కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీవారికి ఆరాధన పూర్తయ్యాక తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ వేంకటేశ్వరుడు అధిరోహించిన రథం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. గోవింద నామ స్వరంతో సప్తగిరులు మార్మోగాయి. శ్రీవారిని దర్శించుకొని ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠ ప్రదక్షణ చేసి భక్తులు పునీతులయ్యారు. ఉత్తర ద్వార దర్శనం అనంతరం భక్తులు మహాప్రసాదం స్వీకరించారు.