వారం రోజులుగా అదృశ్యం..సౌదీలో మృతి

వారం రోజులుగా అదృశ్యం..సౌదీలో మృతి

 దుబాయ్: భారత సంతతికి చెందిన వ్యక్తి సౌదీ అరేబియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేరళకు చెందిన జాబర్ కేపీ అనే వ్యక్తి బ్యాంకులో ఉద్యోగం చేస్తూ అబుదాబి పట్టణంలో నివసిస్తున్నాడు. అయితే జాబర్ కేపీ అబుదాబి పట్టణ సరిహద్దులోని జాబర్ కేపీ ముస్సఫా పారిశ్రామిక వాడలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జాఫర్ కేపీని గుర్తించిన అక్కడి స్థానిక కార్మికులు అతని సోదరుడు మునీర్‌కు సమాచారమందించారు.

మేము కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందినవాళ్లం. జాబర్ కేపీ తొమ్మిదేళ్లుగా అబుదాబి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే జాబర్ వారంరోజులుగా కనిపించడం లేదు. నేను పోలీసులకు ఫిర్యాదు చేశా. అతనికి ఎవరితోనూ ఎలాంటి సమస్యలు లేవు. జాబర్ చనిపోయిన విషయం నాకు ఫోన్ చేసి చెప్పేంత వరకు తెలియదు. నా సోదరుడు జాబర్ మరణానికి గల కారణమేంటో తెలియదు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు మునీర్. మునీర్ కూడా అబుదాబి బ్యాంకులోనే విధులు నిర్వర్తిస్తున్నాడు. పోస్టుమార్టం తర్వాత అతని మరణానికి గల కారణాలు తెలుస్తాయని మునీర్ తెలిపాడు.