వీసా గడువు ముగిసినా థాయ్‌లాండ్‌లో ఉంటూ..

వీసా గడువు ముగిసినా థాయ్‌లాండ్‌లో ఉంటూ..

  బ్యాంకాక్: వీసా గడువు ముగిసినా నిబంధనలకు విరుద్దంగా థాయ్‌లాండ్‌లో ఉంటున్న భారతీయుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాకేశ్‌యాదవ్ వీసా ముగిసినప్పటికీ థాయ్‌లాండ్‌లో ఉండటమే కాకుండా..వ్యాపారులకు రుణాలిచ్చే బిజినెస్ చేస్తున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. రాకేశ్ యాదవ్ నిబంధనలను అతిక్రమించి రుణాలిచ్చిన వారి దగ్గర పరిమితికి మించి వడ్డీని తీసుకుంటున్నట్లు గుర్తించారు.

ఫిచిట్ ముయాంగ్ జిల్లాలోని ఓ స్టేషన్ వద్ద వర్తకుడి వద్ద డబ్బు వసూలు చేస్తుండగా..
పోలీసులు రాకేశ్‌యాదవ్‌ను అరెస్ట్ చేశారు. రాకేశ్‌యాదవ్ వీసా ఫిబ్రవరికే ముగిసినట్లు అధికారులు తెలిపారు. అతని దగ్గరున్న 7,867 రూపాయలు, వర్తకుల వివరాలు రాసి ఉన్న డైరీని సీజ్ చేశారు. రాకేశ్‌యాదవ్ రోజుకు అత్యధికంగా 20 శాతం చొప్పున వడ్డీకి రుణాలిస్తున్నాడని, అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.