ఇది రైతు ప్రభుత్వం.. రైతులకు ఉచిత విద్యుత్తు కొనసాగిస్తాం...!!

ఇది రైతు ప్రభుత్వం.. రైతులకు ఉచిత విద్యుత్తు కొనసాగిస్తాం...!!

ఇది రైతు ప్రభుత్వం.. రైతులకు ఉచిత విద్యుత్తు కొనసాగిస్తాం...!!.
 

వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని కొనసాగించి తీరతామని చెప్పారు. నీటిపారుదల శాఖకు ప్రతి నెలా రూ.2,100 కోట్లు కచ్చితంగా జమ చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ కర్తవ్యమని, దీనికి అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నందున పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి, దిండి, సీతారామ ఎత్తిపోతల పథకాల పురోగతిపై ముఖ్యమంత్రి గురువారం సమీక్షించారు. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌ ప్రశాంతరెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, పాలమూరు ఎత్తిపోతల ప్రత్యేక అధికారి రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల సీఈ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్ట్‌లను ఏకం చేసి కొత్తగా రూపొందించిన సీతారామ ఎత్తిపోతల పథకాన్ని భవిష్యత్‌లో బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం దుమ్ముగూడెం వద్ద నిర్మించిన బ్యారేజీ ద్వారా నీటిని తరలించి సీతారామవూపాజెక్ట్‌ను నిర్వహించాలని సూ చించారు. భవిష్యత్‌లో ప్రస్తుతం ఉన్న బ్యారేజీకి 200 మీటర్ల కిందకు మరింత ఎత్తులో బ్యారేజీని నిర్మించి మొత్తం ఖమ్మం జిల్లా అవసరాలను తీర్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల 22 టీఎంసీల నీరు నదిలోనే నిల్వ ఉండటంతో పాటు, దాదాపు 31కిలోమీటర్ల మేర నదిలో నీరు నిలుస్తుందన్నారు. దీనిద్వారా 320మెగావాట్ల విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు.