తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.

తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.

తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వచ్చేనెలలో తెలంగాణకు రానున్నారు. మెదక్ జిల్లాలో గజ్వేల్‌లో మిషన్ భగీరథను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా పెగడపల్లిలో నిర్మించిన ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌ను మోదీ ప్రారంభిస్తారని సమాచారం. ఆగస్టు 7న కార్యక్రమం ఉండవచ్చని తెలుస్తోంది. గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్పీ సింగ్ పరిశీలించారు. మూడు హెలీప్యాడ్‌లకు స్థలాలతో పాటు 2లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రధాని కార్యక్రమాన్ని ప్రభుత్వ వర్గాలు ఇంకా ధృవీకరించలేదు.