బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు

ఆదిలాబాద్: చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే అమ్మవారికి మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, మహాహారతిని చేపట్టారు.

ఈ రోజంతా అమ్మవారికి చండీవాహనం, వేదపారాయణం, మహాపూజ కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం అమ్మవారిని పల్లకీలో ఊరేగిస్తారు. బాసర వసంత పంచమి వేడుకలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇవాళ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.