ముంబై బీచ్‌కు కొట్టుకొచ్చిన వేల్‌

ముంబై బీచ్‌కు కొట్టుకొచ్చిన వేల్‌

  ముంబై : నవీ ముంబైలోని ఖర్‌ దాండా తీరానికి 40 అడుగుల పొడవైన వేల్ శవమై కొట్టుకువచ్చింది. గురువారం ఉదయం వేల్‌ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు మరణించింది బ్లూ వేల్‌ అని వెల్లడించారు. గత మూడేళ్లలో ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది సార్లు ఇలా మహారాష్ట్ర తీరానికి వేల్‌ మృతదేహాలు కొట్టుకొచ్చాయి.చనిపోయిన వేల్‌ టిష్యూలను మహారాష్ట్ర అధికారులు సేకరించారు. వేల్‌ దాదాపు 20 టన్నులకుపైగా బరువు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. చనిపోయి చాలాకాలం అవుతుండటం వల్ల బ్లూ వేల్‌ దేహం రంగు మారిందని తెలిపారు.