రోదసిలోకి దూసుకెళ్లిన ‘స్పేస్‌ ఎక్స్‌’

రోదసిలోకి దూసుకెళ్లిన ‘స్పేస్‌ ఎక్స్‌’

  మియామి : చంద్ర, అరుణగ్రహ యానాన్ని సులభతరం చేయటమే లక్ష్యంగా చేసుకుని నిర్మించిన 'ప్రపంచపు అత్యంత శక్తివంతమైన రాకెట్‌' స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగపరీక్ష విజయ వంతమైంది. ఫ్లోరిడాలోని కేప్‌ కెనవెరాల్‌ అంతరిక్ష కేంద్రం నుండి మంగళవారం మధ్యా హ్నం (స్థానిక కాలమానం ప్రకారం) 1.30గంటల సమయంలో ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఫాల్కన్‌ హెవీ పేరుతో నిర్మిం చిన ఈ రాకెట్‌ వినియోగంపై నాసా తుది నిర్ణయం తీసుకుంటుందని ఎబ్రీ రిడిల్‌ ఎయి రోనా టికల్‌ యూనివర్శిటీకి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎరిక్‌ సీడ్‌హౌస్‌ వివరించారు.