సోయుజ్‌ రాకెట్‌లో సాంకేతిక సమస్య

సోయుజ్‌ రాకెట్‌లో సాంకేతిక సమస్య

 న్యూయార్క్‌ : అమెరికన్‌, రష్యన్‌ వ్యోమగాములను అంతర్జాతీయ రోదసీ కేంద్రానికి తీసుకెళుతున్న సోయుజ్‌ రాకెట్‌ను ప్రయోగించిన వెంటనే ఇంజనులో సాంకేతిక సమస్య తలెత్తిందని రష్యా మీడియా తెలిపింది. అయితే వ్యోమగాములు ఇరువురు క్షేమంగా వున్నారని పేర్కొంది. వారు కజకస్తాన్‌లో దిగారని రష్యా రోదసీ సంస్థను ఉటంకిస్తూ మీడియా వార్తలు తెలిపాయి. గురువారం ఉదయం 8.40గంటలకు బైకనూర్‌ కాస్మొడ్రోమ్‌ నుండి సోయుజ్‌ను ప్రయోగించారు.