వీక్షకులను కనువిందు చేసిన బ్లడ్‌మూన్‌

వీక్షకులను కనువిందు చేసిన బ్లడ్‌మూన్‌

 న్యూయార్క్‌ : ఆదివారం రాత్రి, సోమవారం వేకువజామున అరుదైన సూపర్‌ బ్లడ్‌మూన్‌ను ప్రజలు వీక్షించారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల్లోని ప్రజలు పూర్తి చంద్ర గ్రహణాన్ని చూడగలిగారు. సాధారణంగా కన్నా కూడా చాలా పెద్దగా, ప్రకాశవంతంగా చంద్రుడు దర్శనమిచ్చాడు. భూమికి, చంద్రునికి మధ్య గల దూరం తగ్గినందునే ఈ సూపర్‌మూన్‌ దర్శనమిచ్చింది. దాదాపు మూడు గంటల పాటు కొన్ని చోట్ల కనిపించగా, మరికొన్ని చోట్ల ఒక గంట మాత్రమే. కనిపించగా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా చంద్ర గ్రహణం వీక్షకులను కనువిందు చేసింది.